![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి జబర్దస్త్ కమెడియన్ వర్ష రెడీ ఐనట్టు తన మాటల ద్వారా అర్ధమయ్యి కానట్టుగా ఉంది. బిగ్ బాస్ లోగో రిలీజ్ ఐన దగ్గర వాళ్ళు వెళ్తారు, వీళ్ళు వెళ్తారు అంటూ సోషల్ మీడియాలో హడావిడి మొదలయ్యింది..రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసిన వర్షను యాంకర్ ఆమె చదువు గురించి అడిగారు..దానికి వర్ష గట్టిగా నవ్వుతూ " ఇది ఇక్కడ చెప్పను..ఒక పెద్ద షో కి వెళ్తున్నాను నెక్స్ట్...ఆ షోలో చెప్తాను" అనేసరికి యాంకర్ " హో మాకు తెలుసు, మీరు ఏ షోకి వెళ్తున్నారో..రివీల్ చేసేయమంటారా" అని అడిగింది. దానికి వర్ష నవ్వేసి "వొద్దొద్దు" అని అంది. "ఏ పేమెంట్ రాదంటారా..అగ్గ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుందంటారా" అని యాంకర్ అనేసరికి. " కొన్ని చెక్స్ ముందే ఇచ్చేసారు నాకు చెప్తే అవి వెనక్కి వెళ్ళిపోతాయని దాచి ఉంచా" అని చెప్పింది వర్ష.
"ఎంత ఇచ్చారు చెక్ అడ్వాన్స్" అని యాంకర్ అడిగారు కానీ రివీల్ చేయలేదు వర్ష. షో గురించి ముందే రివీల్ చేయకూడదు అంటే అది బిగ్ బాస్ షో..నెక్స్ట్ ఆ షో అనేసరికి త్వరలోనే బిగ్ బాస్ రాబోతోంది కాబట్టి జబర్దస్త్ నుంచి లేడీ కంటెస్టెంట్ గా వర్ష వెళ్లబోతోందా అనే ప్రశ్న ఆడియన్స్ లో మొదలయ్యింది. అలాగే వర్షకు "జూనియర్ సమంత" అంటూ కొంతమంది కాంప్లిమెంట్స్ ఇచ్చారట. అష్షు రెడ్డిని జూనియర్ సమంతల ఉంటావని నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉండడం మనకు తెలుసు. ఇప్పుడు ఆమెకు పోటీగా వర్ష కూడా జూనియర్ సమంత అంటూ వచ్చేసింది. ఇక ఈ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ అంటే క్రష్ అని ఆయనకు గర్ల్ ఫ్రెండ్ రోల్ లో నటించాలని , అలాగే ఎన్టీఆర్ కి, రామ్ చరణ్ కి సిస్టర్ రోల్ చేయాలనీ ఉందని కూడా చెప్పేసింది. అలాగే తన ఫామిలీలో జరిగిన ఎన్నో సంఘటనలను కూడా ఈ షోలో షేర్ చేసుకుంది జబర్దస్త్ లేడీ కమెడియన్ వర్ష .
![]() |
![]() |